మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను తరలించడం అన్యాయం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ప్రాంతానికి మంజూరైన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ పట్టణంలో కాకుండా వేరే ప్రాంతానికి తరలించడం అన్యాయమని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అందుకు నిరసనగా శనివారం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చదువుల రామయ్య భవనం నుండి ర్యాలీగా బయలుదేరి నాలుగు స్తంభాల కూడలి దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సిద్ద లింగప్ప అధ్యక్షత అధ్యక్ష వహించగా, కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మాట్లాడారు. పత్తికొండ నియోజకవర్గం నుండి మహాత్మ జ్యోతిరావు పూలే బాలురుల గురుకుల పాఠశాల మంజూరు అయిందన్నారు. ఈ హాస్టల్లో అందరికీ అందుబాటుగా పత్తికొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, స్థానిక ఎమ్మెల్యే గారు తన స్వంత గ్రామం కంబలపాడు కు తీసుకుపోవడం చాలా దారుణం అని అన్నారు.దాదాపు ఐదు మండలాల ప్రజలకు పత్తికొండ పట్టణ కేంద్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సౌకర్యవంతంగా ఉన్నచోట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి గాని, ఇలా నియోజకవర్గ ప్రజలందరికీ బాధ్యత వహించాల్సిన ఎమ్మెల్యే వారి సొంత గ్రామాలకు పాఠశాలను తరలించకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. పత్తికొండ పట్టణంలోనే పాఠశాలను ఏర్పాటు చేయాలని లేనియెడల విద్యార్థి, యువజన సంఘాలు పాఠశాల సాధన కోసం తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాస్తారోకో మరిన్ని ఉద్యమాలకు విద్యాసంస్థల బంద్ కూడా పిలుపునివ్వడానికి సంసిద్ధంగా ఉంటామని, కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలుపుకొని వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.


