వైయస్సార్ నగర్ దళిత వార్డులలో నిలిపివేసిన మౌలిక సదుపాయాలు
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వైయస్సార్ నగర్ లో ఒక దళిత వార్డులో రోడ్డు నిర్మించకుండా కక్షపూర్వకంగా వ్యవహరించడం ప్రభుత్వాలకు తగదని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ అన్నారు. ఈరోజు వైయస్సార్ నగర్ లోని సామాజిక శంఖారావం భాగంగా సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో వైఎస్సార్ నగర్ వార్డు ప్రజలు వారి ఇబ్బందులను వారి సమస్యలను తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వైయస్సార్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుండి వరుసగా మూడు వీధులు వరకు రోడ్ల నిర్మాణం జరిగింది. నాలుగవ వీధిలో రోడ్డును ఆపేసి 5 నుంచి రోడ్డు ప్రారంభించడం అనేది జరిగింది ఎందుకంటే ఆ వీధిలో దళితులు మరియు పేదవారు ఉన్నారు. వారిపై ఎందుకు వివక్షత చూపుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ గా ప్రశ్నిస్తున్నామని అన్నారు ఈరోజు వైఎస్ఆర్ నగర్ లో రోడ్లు లేక పూర్తిగా కాలువ లేక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు రాజకీయ నాయకులకు వార్డు కౌన్సిలర్లకు వారి ఓట్లతో అయినా మీకు పని ఉన్నది. ఆ వీధిలో ఉన్న సమస్యలు మీకేం పట్టవా వారి ఆవేదన మీకు పట్టదా అదేవిధంగా రోడ్ల కోసం ఎమ్మెల్యేలను అధికారంలో ఎంత అడిగినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి వారి ఆవేదన తెలిపారు. అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ని అదేవిధంగా మంత్రి ఫరూక్ ని ఈ సందర్భంగా ఒక విషయం అడుగుతున్నాం దళిత ప్రాంతాలలో నివసించే వారిపై మీకు ఎందుకు చిన్న చూపు ఎందుకు ఇంత వివక్షత కక్ష చూపుతున్నారు. ఈరోజు అక్కడ ప్రజలు ఎన్నోసార్లు మేము వెళ్లి అడిగాము ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నామని అంటున్నారు తప్ప మా సమస్యలు పరిష్కరించడం లేదని వారి అంటున్నారు. తక్షణమే వైయస్సార్ నగర్ లోని అన్ని ఏరియాలలో రోడ్ల నిర్మించి సైడ్ కాలువలు నిర్మించాలని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీగా మంత్రి ఫరూక్ ని జిల్లా కలెక్టర్ ని మున్సిపల్ కమిషనర్ ని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా దళితులు నివసించే వీధిలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నందువలన ఆ వీధిలో రోడ్డును ఆపేయడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా డివైఎఫ్ గా ప్రశ్నిస్తున్నామని నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. వీటిని గమనించి తక్షణమే వైయస్సార్ నగర్ రోడ్ల సమస్యపై కాలువల సమస్యపై ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని లేనియెడల వార్డులో ఉన్న ప్రజలను కలుపుకొని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నందమూరి నగర్ కార్యదర్శి సాయి అధ్యక్షులు ఇర్ఫాన్ మరియు ఆ ప్రాంత ఫాదర్ ఇస్రాయెల్ మరియు ప్రసాద్ , మా భాష లక్ష్మీదేవి ఇమాముషం, వినయ్ లక్ష్మన్న తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.


