చేపలు కొంటానని నమ్మించి వృద్ధురాలి బంగారు గొలుసు లాక్కున్న చైన్ స్నాచర్ అరెస్ట్
1 min read
రూ.లక్ష విలువైన బంగారు నానుత్రాడు,బైక్ స్వాధీనం
నిందితుడిని రిమాండ్ కు తరలించిన ఏలూరు రూరల్ పోలీసులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న వృద్ధ మహిళ వద్ద చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి మెడలోని సుమారు రూ. లక్ష విలువైన బంగారు నానుత్రాడును లాక్కొని పరారైన నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ పర్యవేక్షణలో డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ సూచనల మేరకు ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం గాలింపు చేపట్టి మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన అగొల్లు నాగ కార్తీక్ (25)ను బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నానుత్రాడును,హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సదరు ముద్దాయిని ఏలూరు రూరల్ పోలీసులు రిమాండ్ కు తరలించామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు.


