NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్నినో కారణంగా రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

1 min read

జిల్లాలో 17 వేల  967 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాదులో ఉన్నాయి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో పంట పొలాల వద్ద రైతులతో మాట్లాడిన అనంతరం  ఎరువుల దుకాణాన్నిజిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్విఆకస్మికంగా తనిఖీచేశారు. ఎల్నినో కారణంగా సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రైతులకు సూచించారు.  లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో బుధవారం  పొలాల వద్ద నున్న రైతల వద్దకు వెళ్లి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎల్నినో కారణంగా జిల్లాలో సాగు, త్రాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నదని, జిల్లా యంత్రాంగం సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాలిక రూపొందించి అమలు చేస్తున్నదని, అయినప్పటికీ   అధిక నీటివినియోగ పంటల నుండి ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రయత్నించాలన్నారు.  సాగునీటి లభ్యతపై సవివరంగా కలెక్టర్ రైతులకు తెలియజేసి, వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. సాగునీటి లభ్యత, ఆరుతడిపంటలపై రైతులకు అవగాహన కలిగించాలని వ్యవసాయశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.  అనంతరం గ్రామంలోని రామకృష్ణ మాన్యుర్ డిపోని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో  యూరియా, డిఏపి ఎరువుల నిల్వలను తనిఖీ, రిజిస్టర్ లను  పరిశీలించారు.  ఎరువుల నిల్వలను దుకాణంలోని నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువులను అందించాలన్నారు.  ఎరువులను నిర్దేశించిన ధరలకే అమ్మాలని, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసి,  బ్లాక్ మార్కెటింగ్ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  పాత్రికేయులతో  మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల  జిల్లాలో ఎరువుల పంపిణీని పారదర్శకంగా చేపట్టామన్నారు.  జూలై నెలలో యూరియా  అవసరాలు   7089 మెట్రిక్ టన్నుల కాగా,  17 వేల  967 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాదులో ఉన్నాయని, అదేవిధంగా డిఏపి  3506 మెట్రిక్ టన్నులకు గాను 5044 మెట్రిక్   టన్నులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఎరువులకు  ఎటువంటి కొరతా లేదన్నారు.  రైతులకు అవసరమైన ఎరువులను ఏపిఏఐఎంఎస్ ద్వారా అందిస్తున్నామని, ఇప్పటివరకు 6197 మెట్రిక్ టన్నుల ఏరియా, 1712 మెట్రిక్ టన్నుల డిఏపి అందించామన్నారు.  జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇంతవరకు 174 ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి 11 దుకాణాల లైసెన్స్ లు రద్దు చేశామని,  4గురిపై 6ఏ కేసులు నమోదు చేసి,  71 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 140. 24 లక్షల రూపాయల విలువైన స్టాక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న,జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, తహసీల్దార్ నజీముల్లాషా, ఎంపిడిఓ వాణి , ప్రభృతులు పాల్గొన్నారు.

About Author