NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువతకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ కి ఎమ్మెల్యే ప్రత్యేక చర్యలు

1 min read

లైసెన్స్ ల ఆవశ్యకతపై అవగాహన,జారీకి అధికారులకు ఆదేశం

ఎం ఎల్ ఏ సొంగ రోషన్ కుమార్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడి నియోజకవర్గంలో ఏ విధమైన దళారీలు లేకుండా నేరుగా యువతకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం ఆయన నూజివీడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి తో సమావేశమయ్యారు. 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న యువతీ యువకులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, వారికి నేరుగా లైసెన్స్ జారీ కోసం  దరఖాస్తు స్వీకరించడం, రోడ్డు భద్రత నియమావళి తదితర విషయాలపై  మరియు డ్రైవింగ్లైసెన్సులు ఉండడంవల్ల కలిగే ప్రయోజనాలు అవగాహనతో పాటు అర్హులైన వారికి ఎల్ ఎల్ అర్ లు ఇచ్చే విధంగా మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు.అందుకు మండలాల వారీగా అర్హులైన యువతి, యువకుల జాబితాలు సిద్ధం చేయాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

About Author