NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

31లక్షల రూ. నిధులతో నూతనంగా నిర్మించిన సిమ్మెంట్‌ రహదారి ప్రారంభోత్సవం

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాల అమలే తమ ఏకైక లక్ష్యమంటూ ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. ఏలూరు 13వ డివిజన్‌లోని రాజరాజేశ్వరి నగర్‌లో 31లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిమ్మెంట్‌ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడుకు స్థానిక పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే చంటి,,, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి, అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రభివృద్ధి కోసం ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు విశేషంగా పాటుపడుతున్నారని చెప్పారు. వారి బాటలోనే తామంతా నడుస్తున్నామని, ప్రజల సాధకబాధకాలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడుతూ వస్తున్నామన్నారు. రాజరాజేశ్వరి నగర్‌ కాలనీ వాసుల ప్రధాన రహదారి సమస్యకు మోక్షం కల్పించామని, మరిన్ని రహదారులు కావాలని స్థానికులు కోరారని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,,, రానున్న రోజుల్లో వారి ఆకాంక్షలను సఫలీకృతం చేయనున్నట్లు ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అలాగే ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తూ వస్తున్నామని, జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందుకు నిదర్శనమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, ఆ బాధ్యతలో ప్రజలు సైతం భాగం పంచుకోవాలని, కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతివ్వాలంటూ పిలుపునిచ్చారు. ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దశలవారీగా జరుగుతోన్న రహదారుల నిర్మాణమే అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వారి వెంట ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇంచార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇంచార్జ్ మెరుమాల యేసుమని, కో డివిజన్ ఇంచార్జ్ దావూద్, డివిజన్ ప్రెసిడెంట్ ఊడి రాజశేఖర్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సెల్  మెంబర్ దొడ్డి గట్ల శుభమాలిక్, నీటి సంఘం అధ్యక్షులు తెర్లి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు కటికతల యేసు మరియు వివిధ పాదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author