NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీపై అపారమైన అభిమానంతో జీవితకాల సభ్యత్వం

1 min read

– రూ. లక్ష విరాళం అందజేసిన హొళగుంద మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మురళి

హొళగుంద న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీపై ఉన్న అచంచలమైన అభిమానం, దివంగత ఎన్టీఆర్ ఆశయాల పట్ల ఉన్న నిబద్ధతతో హొళగుంద మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మురళి పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జీవితకాల సభ్యత్వం స్వీకరించి పార్టీకి రూ.1,00,000 విరాళం అందజేశారు.అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి కూడా రూ.1,00,000 విరాళం అందజేస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు.మండలంలో ఎందరో కార్యకర్తలు ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీపై మురళికి ఉన్న ప్రత్యేకమైన అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల ఉన్న అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని పార్టీ నాయకులు కొనియాడారు.పార్టీ బలోపేతం కోసం ఎల్లప్పుడూ ముందుండి సేవలందిస్తూ, కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న మురళి సేవలను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటూ పార్టీ విజయానికి తనవంతు కృషిని కొనసాగిస్తానని మురళి తెలిపారు.

About Author