24వ తేది మా పాఠశాల మెగా పీటిఎం కి రండి
1 min read
జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన పెదపాడు జెడ్పి హైస్కూల్ విద్యార్థినీ,విద్యార్థులు
ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: మా పాఠశాలలో మెగా పేరెంట్, టీచర్స్ మీట్ ని నిర్వహిస్తున్నామని, తప్పనిసరిగా రావాలని పెదపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని ఆహ్వానించారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పెదపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని కలిసి మెగా పేరెంట్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి తాము స్వయంగా రూపొందించిన ఆహ్వానపత్రాన్ని అందించారు. తమ పాఠశాలలో ఈనెల 24వ తేదీ ఉదయం 9:30 ని.ల నుండి మెగా పేరెంట్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొనాలని విద్యార్థినీ, విద్యార్థులు కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నవ్వుతూ సదరు ఆహ్వానపత్రాన్ని స్వీకరించి, ఆహ్వానపత్రాన్ని రూపొందించిన వారిని అభినందించారు.మెగా పేరెంట్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి విచ్చేస్తానని కలెక్టర్ విద్యార్థినీ,విద్యార్థులకు తెలిపారు. పెదపాడు ఎంఈఓ ఎస్. నరసింహమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. విజయ, ప్రభృతులు పాల్గొన్నారు.


