NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపటి మెగా పీటీఎం విజయవంతానికి ముందస్తు ఏర్పాట్లు పూర్తి

1 min read

అపెరల్ విభాగం సహకారంతో పాఠశాలలో విస్తృత ఏర్పాట్లు

హోళగుంద న్యూస్ నేడు: రేపు నిర్వహించనున్న మెగా పీటీఎం (తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం) విజయవంతంగా నిర్వహించేందుకు పాఠశాలలో అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి.పాఠశాల అపెరల్ విభాగం సహకారంతో సభా ప్రాంగణం, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోసం కూర్చునే ఏర్పాట్లు, స్వాగత ఏర్పాట్లు, సూచిక బోర్డులు తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మెగా పీటీఎం ద్వారా విద్యార్థుల విద్యా పురోగతి, క్రమశిక్షణ, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులతో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి తల్లిదండ్రి సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ ఏర్పాట్లలో ఉపాధ్యాయులు, అపెరల్ విభాగం సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది సమిష్టిగా పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

About Author