(సర్) -2026 క్షేత్రస్థాయిలో పరిశీలించి,అభ్యంతరాలు లేని ఓటరు జాబితాను రూపొందించాలి
1 min read
స్వర్ణగ్రామ,స్వర్ణవార్డు సచివాలయాలు ప్రజలు తృప్తిచెందేలా సేవలు అందించాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) -2026 క్షేత్రస్థాయిలో పరిశీలించి, అభ్యంతరాలు లేని ఓటరు జాబితాను రూపొందించాలనిజిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం స్వర్ణగ్రామ సచివాలయంలో బుధవారం అధికారులు, బిఎల్వో లతో జిల్లా కలెక్టరు సమీక్షించారు. 50 మంది బిఎల్వోలు, 50 పోలింగు స్టేషన్లు యాప్ లను పరిశీలించారు. వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం సచివాలయాన్ని తనిఖీలు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలు అమలుతీరుపై వెరిఫై చేసి, అందుతున్న సేవలుపై ప్రజలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) -2026 ప్రక్రియ జూలై 24, 2026 వరకు కొనసాగుతుందని ప్రతి బూత్ లెవెల్ అధికారి, తమ పోలింగు కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారంను ఓటర్లకు అందించి పూర్తిచెయ్యాలని ఆదేశించారు.అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో నమోదు కావడం, అదేసమయంలో అనర్హులైన వ్యక్తులు పేర్లు ఓటరు జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) యొక్కప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ఈ ప్రక్రియ నిర్దేశించిన సమయంలో పూర్తి అయ్యేందుకు ప్రజలు సహకారం అతి ముఖ్యమని, సమయం రెండు రోజులు మాత్రమే ఉందని విధులను అత్యంత బాధ్యతతో పూర్తిచెయ్యాలని అన్నారు. అనామలస్ భారత ఎలక్షన్ కమీషన్ వారి నియమ నిబంధనలను తూచ తప్పనిసరిగా పాటించి ప్రక్రియను పూర్తిచెయ్యాలని అన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఖచ్చితమైన ఏఎస్డి లిస్టును అత్యంత బాధ్యతగా రూపొందించాలని అన్నారు. గ్రామ సభలో గాని వివిధ రాజకీయ పార్టీలు ద్వారా నిర్ధారణ చేసుకుని ఎటువంటి అభ్యంతరాలు లేని ఓటర్లు జాబితాను పొందించడానికి కృషిచెయ్యాలని జిల్లా కలెక్టరు బిఎల్వో లను ఆదేశించారు.
స్వర్ణగ్రామ,స్వర్ణవార్డు సచివాలయాలు ప్రజలు తృప్తిచెందేలా సేవలు అందించాలి:జిల్లా కలెక్టరు
ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా,పారదర్శకంగా, నాణ్యతతో అందేలా కృషిచెయ్యాలని సూచించారు. ప్రజలు నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, పెండింగులో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యాలయ పరిశుభ్రత, రికార్డులు నిర్వహణ, సేవలు అందజేతలో నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి తెలిపారు. ఒక్క ఫిర్యాదు వచ్చినా శాఖా పరమైన చర్యలు తప్పవని, ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలుపై ప్రజలు నుండి నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని అందుకు అనుగుణంగా క్రమశిక్షణతో, మనస్సుపెట్టి పనిచెయ్యాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, చింతలపూడి ఇఆర్వో వి.వి.యస్.శర్మ, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు జిల్లా అధికారి జి.వెంకట నాయుడు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి.వి.మల్లిఖార్జున రావు, తహశీల్దారు నజీముల్లాషా, యంపిడివో కె.వాణీ, మండల వివిధ శాఖలు అధికారులు, బిఎల్వోలు, స్వర్ణగ్రామ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


