NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలపై విశ్వాసం కలుగుతుంది

1 min read

సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ,నిర్ణయానికి సంఘీభావం

ఏంఆర్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి,అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్  డాక్టర్:పొలిమేర హరికృష్ణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్,నగరపాలక, పురపాలక మండల పాలక,ఆయా అధ్యక్షుల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానమే  సరైనదని ఆ దిశగా ఆలోచన చేస్తున్న సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ నిర్ణయానికి సంఘీభావం తెలియజేస్తూనట్లు ఏంఆర్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్  డాక్టర్:పొలిమేర హరికృష్ణ అన్నారు.స్థానిక సంఘ కార్యాలయంలో ముఖ్య నాయకుల తో హరికృష్ణ మాట్లాడుతూ పరోక్ష ఎన్నిక ద్వారా ప్రజలు గెలిపించారనే ఆలోచన ఏదీ రాదని,అటువంటి అధ్యక్ష పదవులు ద్వారా ప్రజలపై నిర్లక్ష్య భావం ఉంటుందని, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలపై విశ్వాసం కలుగుతుందని, ఆయా అధ్యక్షులకు ప్రజల పట్ల జవాబుదారుతనo ఉంటుందని, ప్రజలతో మమేకం అవుతారని ఇది  సరైన నిర్ణయం అని కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు.టిడిపి వ్యవస్థాపకులు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు సినిమాల్లో నటించే సమయంలో “కథానాయకుడు” చిత్రంలో మున్సిపల్ చైర్మన్ గా పాత్ర పోషిస్తే, అందులో కౌన్సిలర్స్ గా పాత్రలు పోషించిన కుటిల కౌన్సిలర్ల పాత్రధారులు నాటి చైర్మన్ పాత్రధారి (ఎన్టీఆర్) ని పదవి నుంచి  తప్పిస్తారని బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునేమో నాటి సీఎం గా ఉన్న ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారని ఈ సందర్భంగా హరికృష్ణ గుర్తు చేశారు. నాటి ప్రభుత్వ ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టిడిపి జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా 1987లో యర్రా నారాయణస్వామి అత్యధిక ఓట్లతో ఘనవిజయం సాధించినట్లు హరికృష్ణ చెప్పారు.ప్రత్యక్ష ఎన్నికలకు మా ప్రజా సంఘాల తరఫున మద్దతు తెలియజేస్తున్నట్లు  హరికృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు పాక ప్రభాకర్ రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉండి నాగేశ్వరరావు, పొలిమేర రాజు,పి.సురేష్,బి.రామకృష్ణ సిచ్ వెంకన్న,ఎం.శ్రీను,రెల్లి సంఘ నాయకులు కె.శ్రీనివాస్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

About Author