గోర్రెల కాపరులను ఆదుకోవాలని జేసికి వినతి
1 min read
వినతి పత్రం అందజేసిన కర్నూలు జిల్లా కురువ సంఘం.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు దగ్గర తేదీ: 21-07- 26 సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 47 గొర్రెలు( దాదాపు 5 లక్షలు )కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని గురువారం జాయింట్ కలెక్టర్ నూరుల్లా ఖమర్ వినతిపత్రం అందజేసిన వారిలో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కే రంగస్వామి కోశాధికారి కె సి నాగన్న ఉపాధ్యక్షులు ధనుంజయ తిరుపాల్ మద్దిలేటి ఏల్లయ్య పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంనకు చెందిన కురువ బీచుపల్లి , కురువ విగ్నేష్, మరియు కురువ శేఖర్ కు చెందిన 47 గొర్రెలు మరియు మేకలు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వద్ద రోడ్డు దాటుతుండగా ఐచర్ వాహనం డ్రైవరు వాహనాన్ని ఆపాడు, వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది.గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్న పెద్దటేకూరుకు చెందిన కురువ బీచుపల్లి, కురువ విగ్నేష్ మరియు కురువ శేఖర్లకు దాదాపు 5 లక్షల నష్టం జరిగింది. కావున నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరుచున్నాము.


