NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‎పార్లమెంటు ఆవరణలో ఎన్డీఏ ఎంపీల నిరసన..

1 min read

పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

‎ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: నీట్ పేపర్‌ లీక్‌ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ గురువారం ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం పార్లమెంటు మకర్ ద్వార్ వద్దకు చేరుకున్న బీజేపీ, టీడీపీ సహా ఎన్డీఏ పార్టీల ఎంపీలు కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకో యువతను రెచ్చగొట్టవద్దు అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. “షరమ్‌ కరో” (సిగ్గుచేటు) “వందేమాతరం” అంటూ ఎన్డీయే ఎంపిలు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఆవరణ కొద్దిసేపు దద్దరిల్లింది. ఈ నిరసనలో ఇతర టీడీపీ ఎంపీలతో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా పాల్గొన్నరు.

About Author