ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులు నిరసనగా ఎమ్మార్పీఎస్ మద్దతు
1 min read
విద్యార్థులపై లాఠీ చార్జి చేసి దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు మాదిగ
న్యూస్ నేడు, పత్తికొండ : దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల పేపరు లీక్ అక్రమాలపై విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు మాదిగ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుజుల పులికొండ మాదిగ,జిల్లా కన్వీనర్ బొంతల నరసింహులు మాదిగ,జిల్లా నాయకులు గోపాలం ఉచ్చూరప్ప మాదిగ,కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు గురువారం పత్తికొండ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలి దగ్గర ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకు శాంతి భద్రతలు దిగజారుతున్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోతుందని అన్నారు. నీట్ పేపర్ లీక్ వలన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు శాంతియుతంగా ఢిల్లీ రాజధాని కేంద్రంలో విద్యార్థులు ధర్నా చేస్తుంటే వారిపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేసి రక్త గాయాల పాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను నీట్ పేపర్ లీకు వ్యవహారాలకు బాధ్యతగా రాజీనామా చేయించాలని కోరారు. నీట్ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా.


