NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్ వాడీ అద్దె భవనం దురదృష్టకరం…

1 min read

సీపీఎం నాయకులు కొంగర వెంకటేశ్వర్లు..

నందికొట్కూరు న్యూస్ నేడు: కొణిదేల గ్రామంలో అద్దె భవనంలో అంగన్వాడీ భవనం ఉండటం చాలా దురదృష్టకరమని సిపిఎం నాయకులు కొంగర వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడి భవనాన్ని గురువారం కొంగర వెంకటేశ్వర్లు గ్రామస్తులు మౌలాలి,ఈశ్వరయ్య, జయన్న పరిశీలించారు.ఈ సందర్భంగా కొంగర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  అంగన్వాడి భవనం శిథిలమైన ప్రభుత్వ భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ భవనం ఉండగా అద్దె భవనానికి నిధులు వెచ్చించడం ప్రజాధన దుర్వినియోగమేనని ఆయన విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author