రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థినుల ఎంపిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు కే. లోకేశ్వరి, కే. అనన్య, వై. నికిత రెడ్డి జూలై 24 నుండి 26 తేదీల వరకు అనంతపూర్‌లోని ఆర్‌డీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్న జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల సీఈవో జి. గోపినాథ్ విద్యార్థినులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కో-సీఈవో సౌమ్య గోపినాథ్ మాట్లాడుతూ, ఫుట్బాల్ వంటి క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.విద్యార్థినుల విజయానికి కృషి చేసిన ఫుట్బాల్ కోచ్ బ్రహ్మకుమార్ ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఎ. రాజ్ కమల్ , హెచ్‌వోడీలు నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని ఎంపికైన విద్యార్థినులకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రస్థాయి పోటీలలో విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.


