NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జేఏసీ పక్షాన ఉద్యోగుల సమస్యలపై  మెమోరాండం అందజేత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర అధ్యక్షులు మరియు APJAC చైర్మన్ కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ ,సెక్రటరీ జనరల్ ప్రసాద్ , మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ  పిలుపుమేరకు,ఉద్యోగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మేమోరాండం సమర్పించు  కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి జవహర్లాల్  మరియు జిల్లా కార్యదర్శి ఎం.సి. కాశన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి, మరియు మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి  రాఘవేందర్ రెడ్డి కి, వారి నివాసము నందు  కర్నూలు జేఏసీ పక్షాన ఉద్యోగుల సమస్యల గురించి చర్చించి  మెమోరాండం ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమోహన్, కోడుమూరు అద్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మద్దిలేటి ,వరప్రసాద్, కోశాధికారి తిరుమల్ రెడ్డి,మరియు ఎమ్మిగనూరు కార్యవర్గము. తదితరులు పాల్గొన్నారు.మరియు ఈ విషయం గురించి ముఖ్యమంత్రి తో చర్చిస్తాము అని వారు హామీ ఇవ్వడం జరిగినది.

About Author