NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల కష్టమే..విజయం:కలెక్టర్

1 min read

విద్యార్థులకు నిజమైన ఆస్థి విద్య

నందికొట్కూర్ లో మెగా పీటీఎం లో కలెక్టర్ రాజకుమారి..

నందికొట్కూరు న్యూస్ నేడు: విద్యార్థుల కష్టమే వారి మార్గం సుగమం అవుతుందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో శుక్రవారం జరిగిన తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం(మెగా పీటీఎం- 4.0) కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జిల్లా కలెక్టర్ కు విద్యార్థులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూవిద్యార్థుల ఉన్నత భవిష్యత్ తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమని విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరమని విద్యార్థుల హాజరు,చదువుపై ఆసక్తి పెంచే విధంగా పనిచేయాలని సూచించారు.

పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలి

ప్రతి ఉపాధ్యాయుడు నిర్దిష్ట వ్యవధిలో విద్యార్థుల ఇళ్లను సందర్శించాలి. అంగన్‌వాడీ నుంచి డిగ్రీ, పాలిటెక్నిక్,వృత్తి విద్యా కోర్సుల వరకు ప్రతి విద్యార్థి విద్యా ప్రస్థానాన్ని ట్రాక్ చేసే విధంగా రికార్డులు నిర్వహించాలని భవిష్యత్తులో కెరీర్ గైడెన్స్‌కు ఇది దోహదపడుతుందన్నారు. నిరంతర సాధన ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని “నేను చేయగలను”అనే దృక్పథం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.పరిశుభ్రత,శానిటరీ నాప్‌కిన్ల వినియోగం,టాయిలెట్ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

నేలపై కూర్చుని భోజనం చేసిన కలెక్టర్

సమావేశం అనంతరం నేలపై కూర్చుని విద్యార్థులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు.తల్లిదండ్రుల సూచనల మేరకుమరుగుదొడ్లను త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాలని పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ అనుసంధానం 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి తిరిగి విద్యాబాట పట్టించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి,పట్టణ సీఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

About Author