NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వర్ణ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బిఎల్ఓ లకు ఆదేశం

పెదపాడు గ్రామంలో పారిశుద్ధ్య పనులను పారిశుద్ధ్య కార్మికులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లో  అనామలీస్ వెంటనే పూర్తి చేయాలనీ   జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బిఎల్ఓ లను ఆదేశించారు.    పెదపాడులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి,కార్యాలయ రికార్డులు, హాజరుపట్టికను పరిశీలించారు.  ప్రజలకు నాణ్యమైన సేవలు వేగవంతంగా అందించాలన్నారు.  ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై బిఎల్ఓ లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువు   ముగుస్తున్నందున   అనామలీస్ వెంటనే పూర్తి చేయాలన్నారు. బిఎల్ఓ ల వారీగా పెండింగ్ జాబితాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు.  అనంతరం కార్యాలయ ఆవరణను పరిశీలించి, విశాలమైన ఆవరణలో మొక్కలు పెంచాలని సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేయాలి. జిల్లా కలెక్టర్  పెదపాడు గ్రామంలో పారిశుద్ధ్య పనులను పారిశుద్ధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలంలో అపరిశుద్ద్యం  కారణంగా వ్యాధులు ప్రబలకుండా డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా  సిల్ట్ తొలగించాలన్నారు.    గ్రామంలో రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా శుభ్రం చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరించాలన్నారు.   కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణజ్యోతి,ఎంపిడిఓ అమీన్ జమ, పెదపాడు సెక్రటరీ భవాని సచివాలయ  ప్రభృతులు పాల్గొన్నారు.

About Author