చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు
1 min read
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి)
వైద్య శిబిరం లో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామం లోని దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరియు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆహ్వానం మేరకు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి)ముఖ్య అతిధిగా హాజరై య్యారు. ఈ వైద్య శిబిరానికి నియోజకవర్గ నలుమూలల నుండి హాజరైన వివిద రకాల వ్యాధి గ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.



