పేద విద్యార్థులకు ఆసరా: సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్థిక సాయం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల, తల్లిదండ్రులను కోల్పోయి చదువుకు దూరమవుతున్న అభాగ్యులైన పేద విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం p4 విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.ఈ క్రమంలో శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని సీఎం అన్నారు. ఆస్పరి పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అర్హులైన పేద విద్యార్థులకు ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉదారతతో ముందుకు వచ్చి చెక్కులను అందజేసిన శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.లబ్ధి పొందిన పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో రాణించాలని సీఎం ఆకాంక్షించారు. సమాజంలో చదువుకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులకు p4 ద్వారా ప్రతి ఒక్కరూ తమవంతు ఆసరాగా నిలిస్తే, వారు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధించి సమాజానికి సేవ చేయగలరనీ సీఎం పిలుపు ఇచ్చారు.


