NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూర్’లో 2,20,814 మంది ఓటర్లు

1 min read

ఆగస్టు 30 వరకు ఫిర్యాదుల స్వీకరణ-డివిజన్ ఎన్నికల అధికారి వెంకట శివ..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 2లక్షల 20 వేల 814 ఓటర్లు ఉన్నారని ఆత్మకూరు డివిజన్ ఎన్నికల అధికారి (ఆర్డీవో) సి వెంకట శివ శనివారం అన్నారు.ఈ సందర్భంగా  ఎన్నికల అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఈసీఐ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో బిఎల్ఓ అధికారులు జూన్ 15 నుండి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తూ ఓటర్ల పూర్తి వివరాలను ఆన్లైన్ లో డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేశారు. నియోజకవర్గంలో ఉన్న  2,20,814 మంది ఓటర్లలో ఒక లక్ష 97,610 ఓటర్ల వివరాలు నమోదు చేసినట్లు మరణించిన ఓటర్లు-9,057 మంది, ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు-5,408 మంది..జాడ లేని మరియు గైర్హాజర్ అయిన ఓటర్ల సంఖ్య-4,398 మంది ఉన్నారని డివిజన్ ఎన్నికల అధికారి తెలిపారు.

అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా

జులై 31న ముసాయిదా తాత్కాలిక ఓటర్ల జాబితా ప్రచురిస్తాం.ఇంతవరకు చేపట్టిన ఎస్ఐఆర్ ఓటర్ల ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుండి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. సెప్టెంబర్ 28 వరకు ఓటర్ల సమస్యలకు పరిష్కారం చూపుతామని అదేవిధంగా అక్టోబర్ 3 వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ఆత్మకూరు డివిజన్ ఎన్నికల అధికారి వెంకట శివ అన్నారు.వీటిని నియోజకవర్గ ఓటర్లు గమనించాలని కోరారు.

About Author