NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్కాలర్‌ షిప్‌లను అందజేసిన ఏలూరు జిల్లా ఎస్పీ

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్కాలర్‌ షిప్‌లను విద్యార్థులను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్అందజేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి యొక్క కార్యాలయం నుండి మంజూరైన మెరిట్ & మెడిటోరియస్ స్కాలర్‌షిప్‌లు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ అర్హత సాధించిన పోలీసు కుటుంబాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అంద చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గతంతో పోలిస్తే పోలీస్ అంటే భయపడే విధానం పోయిందని పోలీసు పిల్లలు అందరూ కూడా ఉన్నత విద్యులను ఐఐటి డాక్టర్లు వివిధ అంశాలలో ఉత్తీర్ణత సాధిస్తున్నారని బాగా చదువుతూ అందరికీ ప్రోత్సాహకంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ ఎదుటివారిని చూసి నేర్చుకొని ఉన్నత విద్యాభ్యాసం చేయాలని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో చేరినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు రాష్ట్రాలు విభజన జరిగినా వాళ్లలో ఐకమత్యం తోటి సహాయ సహకారాలను కలిగి ఉన్న విషయాలపై మనం కూడా స్పందన కలిగి ఉండాలని తెలియజేశారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని రానున్న కాలాలలో పోలీస్ సిబ్బంది ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరు ఏపీపీఎస్సీ డాక్టర్లుగా చదువులు మంచి చదువులు సంపాదించాలని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలన్నారు. ఈ మధ్యకాలం డిజిపితో ఇలా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారికి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ  విద్యలోహామీ ఇచ్చరు.ఏలూరు జిల్లా ఎస్పీ  అనంతరం  విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం, వారి ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడం, పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందిస్తున్న ప్రాధాన్యతకు ఈ స్కాలర్‌షిప్‌లు నిదర్శనమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.మెరిట్ మరియు మేధోపరమైన స్కాలర్‌షిప్‌ల మంజూరు అయిన వారి యొక్క జాబితా ఈ విధంగా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అదనపు ఎస్పి వై ప్రసాద్ రావు,ఏ ఆర్ అదనపు ఎస్పీ జి ముని రాజా,పవన్ కుమార్,సతీష్ కుమార్, ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

About Author