ఆర్టీఓ కార్యాలయం తరలించడం విరమించాలి
1 min read
లారీలు అధికంగా వున్న మదనపల్లె లో ఏటీఎస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
వైసిపి సమన్వయ కర్త నిస్సార్ అహమ్మద్
మదనపల్లె న్యూస్ నేడు ప్రతినిధి :మదనపల్లెలో ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయాన్ని రాయచోటికి తర లించే ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, రాయచోటి లోని ఏటీఎస్ కేంద్రం మదనపల్లె లో ఏర్పాటు చేయాలని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె వైయస్సార్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి, రఫీ తో కలిసి నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేసినా ఎప్పుడు సిఎం మనసు మార్చు కుని మళ్ళీ జిల్లా కేంద్రం రాయచోటికి తరలిస్తాడో చెప్ప లేమని ఎద్దేవా చేశారు. మదనపల్లె పేరుమీద జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరితే అన్నమయ్య జిల్లా ఇక్కడి ఏర్పాటు చేశారని, ఇది సిఎం చంద్రబాబునాయుడు మనస్తత్వానికి నిదర్శనమన్నారు. మదనపల్లెలో వేలాది మంది మంది లారీ యజమానులు వున్నారని, వారి ఇబ్బందులు గుర్తెరిగి జిల్లా రవాణా శాఖ కార్యాలయం మదనపల్లెలో ఏర్పాటు చేయాలని కోరారు. అన్నమయ్య జిల్లాలో సుమారు 25 వేల భారీ వాణిజ్య వాహ నాలు ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో రవాణా అవసరాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీవో కార్యాల యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తరలించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.దీనివల్ల ఇంధన వ్యయం, డ్రైవర్ వేతన భారం, వాహనాల నిలిపి వేత కారణంగా ఆర్థిక నష్టం కలుగుతోందని తెలిపారు. మదనపల్లె ఆర్టీవో కార్యాలయం తరలింపు ప్రతి పాదనను విరమించు కోవడంతో పాటు మదనపల్లె కార్యాలయాన్ని జిల్లా రవాణా కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేసి, ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ సెంటర్‌ను మదనపల్లెలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


