NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల మార్కెట్ యార్డు పరిరక్షణ కోసం మహాసత్యాగ్రహ దీక్ష

1 min read

RARS, నూనెపల్లె మార్కెట్ యార్డు పరిరక్షణకు నంద్యాలలో ‘మహాసత్యాగ్రహం’.. హోరెత్తిన ఐక్య పోరాటం

రైతుల భూముల్లో రాజకీయాలా? నంద్యాలలో భగ్గుమన్న ప్రజా సంఘాలు

నంద్యాల మార్కెట్ యార్డ్ కాపాడుకుందాం: రైతన్నల పోరుబాట!

రాజకీయ ఆకలికి రైతుల భూములు బలికావాల్సిందేనా?అఖిలపక్ష ఐక్యవేదిక నిలదీత!

ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుంది: అఖిలపక్ష ఐక్యవేదిక

హామీలు ఏమయ్యాయి..?టీడీపీ ఎన్నికల వాగ్దానాలను గుర్తు చేసిన బొజ్జా దశరథ రామిరెడ్డి

నంద్యాల, న్యూస్​ నేడు:  అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నంద్యాల మార్కెట్ యార్డు వద్ద నూనెపల్లె మార్కెట్ యార్డు పరిరక్షణ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (RARS) పరిరక్షణ కోసం మహాసత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు సత్యాగ్రహ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.మార్కెట్ యార్డు రైతులకు అత్యంత కీలకమైన ఆస్తి అని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి, బ్యాంకుల నుండి పంట రుణాలు పొందడానికి, సరైన ధర వచ్చే వరకు ఉత్పత్తులను భద్రపరచడానికి మార్కెట్ యార్డులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మార్కెట్ యార్డుల ద్వారా వసూలయ్యే సెస్సుతో పంట పొలాలకు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సి ఉండగా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయం దెబ్బతింటే ఆహార ఉత్పత్తి తగ్గిపోతుందని, దాని ప్రభావం చివరకు ప్రజలందరిపై పడుతుందని హెచ్చరించారు. ఈ మహాసత్యాగ్రహ దీక్షలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సహదేవరెడ్డి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు యర్రం విష్ణువర్ధన్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్, AIKS నాయకులు రాజశేఖర్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, PDSU నాయకులు రాంబాబు, న్యాయవాది శంకరయ్య, SDPI నాయకులు ఏజెస్ హుస్సేన్, క్రిష్టియన్ జేఏసీ నాయకులు జానయ్య, న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు చౌడప్ప, CPI రైతు సంఘం నాయకులు సోమన్న, నరశింహులు, CPM నాయకులు నాగరాజు, కే.సీ. కెనాల్ పరిరక్షణ కమిటీ నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు ఎం.సీ. కొండారెడ్డి, ఆల్ మదాద్ ఫౌండేషన్ నాయకులు ఆకుమల్ల రహీం, OPDR నాయకులు ఖాజా మొహద్దీన్, కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు చింతలయ్య, నంది రైతు సమాఖ్య నాయకులు మధుసూధన్ రెడ్డి తదితర రైతు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author