పోక్సో కేసులో యువకుడికి 27 ఏళ్ల జైలు శిక్ష
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎం.రాజు (27)కు అనంతపురం ఫోక్సో కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష మరియు 5 వేల రూపాయలు జరిమాన విధించిన సంఘటన సంచలనం రేపింది.ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు (Cr.No.618/2021) నమోదైంది.నిందితుడు తన భార్య యొక్క మొదటి భర్త కూతురైన మైనర్ బాలికపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.కదిరి టౌన్ ఇన్ స్పెక్టర్ పి సత్యబాబు కేసు దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.POCSO కోర్టు గౌరవ జడ్జి చిన్నబాబు 11 మంది సాక్షులను విచారించి నేరం రుజువుకావడంతో నిందితులకు శిక్ష విధించారు.బాధిత బాలికకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలను పరిహారం చెల్లించాలని గౌరవ న్యాయమూర్తి సిఫార్సు చేశారు.ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (స్పెషల్ పీపీ) జి మురళీకృష్ణ వాదనలు వినిపించారు.శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ,కదిరి డీఎస్పీ ఆదేశాల మేరకు సీఎంఎస్ సిబ్బంది మరియు కోర్టు లైజన్ ఆఫీసర్లు సాక్షులను సకాలంలో హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేలా చేశారు.బాలిక తల్లి సీఐ పి.సత్యబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.


