NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ప్రభుత్వం తోనే ప్రజలకు లబ్ది…ఎమ్మెల్యే

1 min read

వెలుగోడు , న్యూస్​ నేడు: టిడిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ది కలుగు తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. వెలుగోడు పట్టణం లోని సి. పి. నగర్ లో బుధవారం సాయంత్రం బూత్ ఇంచార్జి డా. జాకీర్ ఇంటి నుంచి ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ , ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల ద్వారా లబ్ది పొందార లేదా అని విచారించారు. పథకాల ద్వారా లబ్ది పొందని వారి వివరాలు నమోదు చేసుకుని నా దృష్టికి తీసుకొని రావాలని ఎమ్మెల్యే బూత్ ఇంచార్జి లకు ఆదేశించారు. వైసీపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను తిరిగి ఎన్నుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు అబ్దుల్ కలాం, మోమిన్ రసూల్ , ఎల్లాల కృష్ణుడు, సూర్యనారాయణ, ఖలీల్ , బలుసా రాము , సంజీవరాయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *