“మధ్యవర్తిత్వం 3.0 పై న్యాయవాదులకు ఓరియంటేషన్ కార్యక్రమం”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సుప్రీం కోర్ట్ మధ్యవర్తిత్వ విభాగం ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం అనగా 05-08-2026 దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0 పై ఓరియంటేషన్ కార్యక్రమం లో మీడియటర్స్, ప్యానెల్ అడ్వకేట్ లకు, పారా లీగల్ వాలంటీర్స్, డివిజనల్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రాంచ్ మేనేజర్స్, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు మేనేజర్స్ చిట్ ఫండ్ కంపెనీస్ కు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యాలయం లో కార్యదర్శి మరియు జిల్లా మధ్యవర్తిత్వ సమన్వయకర్త బి. లీలా వెంకట శేషాద్రి గారు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హైకోర్ట్ అన్నీ జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని తీర్మానించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల ఆగష్టు 1 నుంచి డిసెంబర్, 31 వరకు షెడ్యూల్ ప్రకారం మధ్యవర్తిత్వం 3.0- పై ముమ్మర ప్రచారాన్ని ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులో నిర్వహిస్తామని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా ఏ విధంగా కేసులు పరిష్కారం చేయాలని న్యాయవాదులకు అవగాహన కల్పించారు. న్యాయవాదులు కూడా తమ కక్షిదారులకు మీడియేషన్ పై అవగాహన కలిగించి వారి కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఈ మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం కక్షి దారులకు లభిస్తుందని తెలిపారు. న్యాయ సేవ సదన్ నందు మీడియేషన్ కి సంబందించిన స్టాల్ల్స్ కూడా నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో తదితరులు పాల్గొన్నారు.


