NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్టీయూ రాష్ట్ర కో-కన్వీనర్‌గా వెంకట నాయక్‌కు ఘన సన్మానం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఇటీవల ఎస్టీయూ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల కమిటీ కో-కన్వీనర్‌గా నియమితులైన ఈ. వెంకట నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన 25 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ సంఘానికి అందించిన సేవలను ప్రశంసించారు. వెంకట నాయక్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రభుత్వం 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author