NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అల్ హసన ట్రస్ట్’ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ..

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నిరుపేదల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకుంటూ ‘అల్ హసన ట్రస్ట్’ ముందుకెళ్తుంది.నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని కడుమూరు గ్రామంలో నున్న ఆల్ హసన ట్రస్ట్ ఎడ్యుకేషనల్ మరియు వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో ఉన్న 20 నిరుపేద కుటుంబాలకు సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యవసర కిట్లను పంపిణీ చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.గ్రామాల్లో పేదలను గుర్తించి కుటుంబాల్లో అవసరమయ్యే నిత్యవసర సరుకులు చక్కెర, కందిపప్పు,బియ్యం, సబ్బులు,టీ పొడి,సామి యానాలు,ఆయిల్ తదితర వస్తువులు 1200 రూపాయలు విలువచేసే వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ బి సులేమాన్,కార్యదర్శి జియావుర్ రెహమాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ అబ్దుల్ సలాం, కమిటీ సభ్యులు జబీవుల్లా, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author