NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చెయ్యాలి

1 min read

ఎక్కడ ఏఒక్క చిన్న పొరపాటుకు తావులేకుండా  కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తిచెయ్యాలి

గత అనుభవాలను బేరీజు వేసుకుని పనులు వేగవంతం  చెయ్యాలి

అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు పాల్గొన్నారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచెయ్యాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో శుక్రవారం ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో  భాగంగా ముందస్తు ఏర్పాట్లను  ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండు హెలిప్యాడ్ కొరకు, అగ్రికల్చర్ మార్కెటు కమిటీ కార్యాలయం ప్రక్కన  ఖాళీస్థలంలో ప్రజావేదిక, అగ్రికల్చర్ మార్కెటు కమిటీ కార్యాలయం క్యాడరు మీటింగు, తహశీల్దారు కార్యాలయం, తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. తనంతరం యంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లుపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 10వ తేదీ కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రాజముద్రతో రూపొంచిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి రాక సందర్భంగా, శాఖలు వారీగా కేటాయించిన పనులు వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఒక్కచిన్నపొరపాటుకు తావులేకుండా  పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచెయ్యాలని అన్నారు. పర్యటనలో ఏటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో మొత్తం జల్లెడ పడుతున్నామని అన్నారు. బ్యారీకేడింగు, రోప్ పార్టీ, పార్కింగు ప్లేసులు సిద్ధం చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ  పూర్తయ్యేంత వరకు నిరంతరం గట్టినిఘా కొనసాగుతుందని తెలిపారు. విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఫోటోతో కూడిన పాసును ధరించాలని అన్నారు. అనధికార డ్రోన్లు తిరగకుండా గట్టినిఘా పెట్టామని, సీసీ కెమెరాలు పర్యవేక్షణతో పోలీసులు కంట్రోలు రూమ్ ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, విజిలెన్సు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, జిల్లా,డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు,ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు,తదితరులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *