NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్‌గా లయన్ డా. రాయపాటి శ్రీనివాస్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలుకు చెందిన లయన్ డా. రాయపాటి శ్రీనివాస్‌ను లయన్స్ డిస్ట్రిక్ట్ 316j  చైర్‌పర్సన్‌గా  ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ వీరుపాక్ష రెడ్డి  కి రాయపాటి శ్రీనివాస్ ధన్యవదాలు తెలియచేసారు.   లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి  మాజీ క్లబ్ అధ్యక్షులు  మరియు మాజీ జిల్లా అడిషనల్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ సామాజిక సేవ, మానవతా సేవలు, యువత, మహిళలు, బాలలు, వృద్ధుల హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక దురాచారాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ  అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, న్యాయ అవగాహన కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవలో చురుకైన పాత్ర పోషిస్తున్న డా. రాయపాటి శ్రీనివాస్‌కు ఈ బాధ్యత దక్కడం పట్ల లయన్స్ సభ్యులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు“సేవే లక్ష్యం – సమాజ అభివృద్ధే ధ్యేయం” అనే స్ఫూర్తితో లయన్స్ సభ్యుల సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

About Author