దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read
12 నుంచి 14 వరకు ఐక్యతను చాటేలా తిరంగా ర్యాలీ లు
జిల్లా కేంద్రం లో మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలి
ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు
మదనపల్లె న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో జరగబోవు మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ను దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా నిర్వహించాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక ర్యాలీలు 14వ తేదీ రాత్రి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వ హించి జయప్రదం చేయడం పైన శనివారం తన కార్యా లయంలో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష సమావేశా న్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, కళాకారులు, యువజనులు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సోమ వారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహణపై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందని, 12,13,14 వ తేది లు ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని, ఐక్యతను చాటి చెప్పే తిరంగా ర్యాలీలు కొనసాగు తాయన్నారు.జాతీయ పండుగ స్వతంత్ర దినోత్సవాని పురస్క రించుకొని 14వ తేదీ రాత్రి జరిగే వేడుకలకు ప్రత్యేకంగా కళాకారుల బృందం తో పాటు జబర్దస్త్ టీం, పలువురు ప్రముఖు లను ఆహ్వానించడం జరిగిందని స్పష్టంచేశారు. కదిరి రోడ్డు లో స్థానిక టిప్పు సుల్తాన్ మైదానం లో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో విజయ భారతి విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ, టిడిపి రాష్ట్ర చేనేత నాయకులు బొమిశెట్టి పురుషోత్తం, శ్రీ ప్రసన్న వెంకట రమణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


