13న ఆలూరు ఎమ్మెల్యే ని పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
1 min read
వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, బూసినే విరుపాక్షి అభిమానులు భారీగా తరలిరావాలి
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన హొళగుంద మండల వైఎస్సార్సీపీ నాయకులు
హోళగుంద న్యూస్ నేడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారని హొళగుంద మండల వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షిను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సోమవారం హొళగుంద మండల కేంద్రంలోని వాల్మీకి సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు సమావేశమై ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై, పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.“అధికార పార్టీ వారికి ఒక న్యాయం.. వైఎస్సార్సీపీ వారికి మరో న్యాయమా?”వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన వారు దాడులకు పాల్పడితే వారికి రక్షణ కల్పిస్తూ, దాడికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీకి చెందిన వారు దాడి చేశారని, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని సదరు నాయకుడు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షికి ఫోన్ చేసి సహాయం కోరారని నాయకులు తెలిపారు. ఒక పార్టీ కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరినప్పుడు స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? అని ప్రశ్నించారు.
కార్యకర్తలకు అండగా నిలిచినందుకే అరెస్టా?
ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే వాటిపై స్పందించడం ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం, కార్యకర్తకు భరోసా ఇవ్వడం నేరంగా చిత్రీకరించి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వారు ఆరోపించారు.
బూసినే విరుపాక్షి అరెస్టును వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేకు న్యాయం జరిగే వరకు పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడతాయని తెలిపారు.
13న కర్నూలుకు భారీగా తరలిరావాలి
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆలూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బూసినే విరుపాక్షి అభిమానులు కర్నూలుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు పార్టీ శ్రేణులు భారీగా హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు.ఎమ్మెల్యే బూసినే విరుపాక్షికి వైఎస్సార్సీపీ పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ నాయకత్వం వారి వెంట ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారుహొళగుంద మండల కన్వీనర్ షఫీ ఉల్లా, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె. గిరి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా, మౌనేష్, సిందవలం కృష్ణయ్య, ఎంపీటీసీ మల్లయ్య, ఎంపీటీసీ శిక్షావల్లి, సిందవలం వెంకటేష్, రమేష్, జొండేసిద్దయ్య, సమతగేరి నాగరాజ్, మర్రి స్వామి, కుంటనల్ గదిలింగ, కోనేరు సిద్ధప్ప, పాలే ఈరన్న, అశోక్ తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


