అంతర్జాతీయ చదరంగం పోటీల పోస్టర్ విడుదల
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కీర్తి శేషులు డి. రాజవర్ధన్ రెడ్డి 4th మెమోరియల్ ఫిడే రాపిడ్ ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ పోస్టర్ను విడుదల చేసిన కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరి, కేడిసిసిబి చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి.ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి జ్ఞాపకర్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 17 న రాజవర్ధన్ రెడ్డి జయంతి సందర్బంగా అంతర్జాతీయ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో నగదు బహుమతి 2లక్షల రూపాయలు మరియు బంగారం వెండి నాణాలను లక్కీ డ్రా ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డ్ర కేవి సుబ్బా రెడ్డి , టీడీపీ లీడర్ వహీద్ హుస్సేన్ , చంద్రన్న , వెంకట్ రెడ్డి , ఐకాన్ చెస్ అకాడమీ చైర్మన్ శివ రామి రెడ్డి, కోచ్ లు ఇమామ్ హుస్సేన్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.రిజిస్ట్రేషన్ కొరకు apchess.org లేదా 8790443030, 9642762731 లకు సంప్రదించగలరు అని ఐకాన్ చెస్ అకాడమీ చైర్మన్ శివ రామి రెడ్డి తెలిపారు.


