NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

1 min read

జైల్ బరో కార్యక్రమంలో నినరించిన నిరసనకారులు

న్యూస్ నేడు, పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు పని దినాలు 200 రోజులకు పెంచి రోజు వేతనం 700 రూపాయలు ఇవ్వాలని,కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి నష్టపోయిన రైతులకి ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కార్మిక సంఘం, AITUC, AP రైతు సంఘం, AP వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పత్తికొండ పట్టణంలో జైల్ బరో కార్యక్రమం చేపట్టారు.పని చూపండి లేదంటే జైల్లోనైనా పెట్టండి అంటూ నినాదాలతోస్వాతంత్య్ర పోరాటంలో చారిత్రాత్మక ఘట్టమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను తరిమికొట్టాలని ఏఐటీయూసీ (AITUC), ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్థంభాల కూడలి వద్ద పత్తికొండలో “జైలు భరో”  నినదించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్యా ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నబి రసూల్ , సిపిఐ మండల కార్యదర్శి యు కారుమంచి, కౌల్దారు సంఘం జిల్లా కార్యదర్శి కే.తిమ్మయ్య వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.కారన్నలు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పూర్వం బ్రిటిష్ పాలకుల నుంచి పోరాడి  సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి బడా కార్పెట్ యాజమాన్యానికి అనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికులకు అనుకూలమైన పాత చట్టాలను పునరుద్ధరించి కార్మికులకు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *