NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రావణమాస ఉత్సవాలకు నిరంతర విద్యుత్ సరఫరా

1 min read

ఉరుకుందలో ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు పూర్తి

కౌతాళం,  న్యూస్ నేడు: కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్‌డీఎస్‌ఎస్‌   కింద పలు విద్యుత్ మౌలిక వసతుల పనులను చేపట్టి పూర్తి చేశారు.ఉరుకుందలో 16 సంఖ్యలో నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసి, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు హై వోల్టేజ్ మార్పులను నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే కామవరం సబ్‌స్టేషన్‌లో ఆర్‌డీఎస్ బ్రేకర్‌ను ఛార్జ్ చేశారు.ఉరుకుంద గ్రామంలో 100 కేవీఏ డీటీఆర్, 25 కేవీఏ డీటీఆర్‌లను ఛార్జ్ చేసి విద్యుత్ సరఫరాకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో శ్రావణమాస ఉత్సవాల సమయంలో ఉరుకుందకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ పనులను ఎస్‌ఈ ఆర్. ప్రదీప్ కుమార్ పర్యవేక్షణలో ఈఈ భాస్కరరావు, డిప్యూటీ ఇంజనీర్ ఎక్స్క్యూట్ విశ్వశాంత్ స్వరూప్, ఏఈ నరసన్నతో, పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొని పనులను పూర్తి చేశారు. శ్రావణమాస ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *