NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు:  స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు MD Affan, నరసింహ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆగస్టు 12 నుండి 14వ తేదీ వరకు  విజయవాడ లోని మైలవరం లో నిర్వహించనున్న సబ్ జూనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో వీరు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాల సీఈఓ జి. గోపినాథ్  విద్యార్థులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కో-సీఈఓ సౌమ్య గోపినాథ్ మాట్లాడుతూ, ఫుట్‌బాల్ వంటి క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఫుట్బాల్ కోచ్ బ్రహ్మ కుమార్ ను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్  ప్రిన్సిపల్ ఎ. రాజ్ కమల్ , హెచ్‌వోడీలు నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాన్ని సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *