NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ, మంగళవారం  పత్తికొండ లో స్థానిక చదువులరామయ్య భవన్ నందు ప్రచార గోడపత్రికలను విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆటో& మోటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు, ఈశ్వర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్. కృష్ణయ్య, ఏఐటియుసి తాలూకా కార్యదర్శి హెచ్ రంగన్నలు మాట్లాడుతూ, ఆటో, మోటార్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాఖపట్నంలో 2026 ఆగస్టు 20, 21 తేదీలలో పెద్ద ఎత్తున ప్రదర్శన, బహిరంగసభ, జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలో ఆటో మోటార్ కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వాహన మిత్ర పథకం ద్వారా మేము అధికారంలోకి వస్తే 15000 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆటో అండ్ మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు సుమారు 11 లక్షల మంది కార్మికులు ఉంటే గత సంవత్సరం రెండు లక్షల 90 వేల మందికి మాత్రమే ప్రభుత్వం ఆన్లైన్లో వేసింది. మిగతావారు ఏం పాపం చేశారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో మోటార్ కార్మికులపై మెడకు ఉరితాడు తగిలించే విధంగా జీవో నెంబర్ 21, 31లను తీసుకురావడం వల్ల వందల్లో ఉన్న ఫైన్లు వేలల్లో విధిస్తున్నారని అన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఉచితంగా “మహిళలకు ఫ్రీ బస్సు శ్రీ శక్తి పథకం” తీసుకురావడం వల్ల ఆటో మోటార్ కార్మికులు 60శాతం దాకా ఆదాయాన్ని కోల్పోయారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక లక్షలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఆటోలు, మ్యాక్సీ, క్యాబ్లు కొనుగోలు.

About Author