హొళగుందలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి
1 min read
నీళ్ల చారు, ఉడికి ఉడికిన అన్నం పెడుతున్న వంట ఏజెన్సీ మాకు వద్దు
వెంటనే రద్దు చేసి నాణ్యమైన భోజనం అందించాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు
హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులకు మధ్యాహ్న సమయానికి భోజనం సిద్ధం చేసి వేడిగా వడ్డించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులతో భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అయితే హొళగుందలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని ఆరోపించారు. నీళ్ల చారు, ఉడికి ఉడికిన అన్నం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు.“విద్యార్థులకు నీళ్ల చారు, ఉడికి ఉడికిన అన్నం పెట్టే వంట ఏజెన్సీ మాకు వద్ద. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వారిని ఐక్యం చేసి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత వంట ఏజెన్సీ పనితీరుపై సమగ్ర విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లయ్య, వచ్చిరప్ప, నాయకులు మహేష్, రాజు, గౌస్, విజయ్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.



