ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది
1 min read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన “ఇంటింటికి కూటమి- కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పాల్గొని ప్రజలకు కూటమి ప్రభుత్వం 2ఏళ్ల పాలనలో అందించిన అభివృద్ధి సంక్షేమ పాలనను వివరిస్తూ, కార్యక్రమ కరపత్రాలను అందించారు.ఈసందర్భంగా స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా , నియోజకవర్గ పరిశీలకురాలు అంకేం .ఇందిరా ప్రియదర్శిని , మండల పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్ , క్లస్టర్ ఇంచార్జ్ మంచినేని శ్రీనివాస్ , తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరీ నాని సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


