రేపు వాహనాలకు బహిరంగ వేలం
1 min read
ప్రొహిబిషన్ &ఎక్సైజ్ జిల్లా అధికారి రవికుమార్..
నందికొట్కూరు న్యూస్ నేడు: రేపు 14వ తేదీన 3 వాహనాలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ నేరాల్లో స్వాధీనం చేసి ప్రభుత్వానికి జప్తు చేసిన వాహనాలకు రేపు శుక్రవారం ఉ 11గంటలకు నందికొట్కూరు ఎక్సైజ్ కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామన్నారు.వేలంలో పాల్గొనదలచిన వారు సంబంధిత వాహనానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర పై 10 శాతం ధరావతు చెల్లించి రసీదు పొందాలి. విజయవంతమైన బిడ్డర్ అదే రోజున మిగిలిన మొత్తాన్ని చెల్లించి నిబంధనల ప్రకారం జీఎస్టి చెల్లించిన తర్వాత వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారి రవికుమార్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు కోరారు.


