వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్లా రహమతుల్లా
1 min read
వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ధర్మకల్ సురేందర్ రెడ్డి సమక్షంలో భేటీ
హోళగుంద న్యూస్ నేడు: తాడేపల్లి నివాసంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ధర్మకల్ సురేందర్ రెడ్డి సమక్షంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ ముస్లిం మైనారిటీ విభాగం కార్యనిర్వాహక సభ్యులు ముల్లా రహమతుల్లా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముల్లా రహమతుల్లా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, హొళగుంద మండలంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకలాపాలు, ముస్లిం మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో చర్చించినట్లు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్‌సీపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించినట్లు ముల్లా రహమతుల్లా తెలిపారు.ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి మరింత బలం చేకూర్చే విధంగా ముస్లిం మైనారిటీ వర్గాలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ముల్లా రహమతుల్లా పేర్కొన్నారు.ఈ భేటీ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలవడం ఆనందంగా ఉందని, ఆయన నాయకత్వంలో ప్రజా సమస్యలపై మరింతగా పనిచేస్తామని ముల్లా రహమతుల్లా తెలిపారు.



