ఈనెల 14న సోలార్ బాధిత రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
1 min read
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ
న్యూస్ నేడు, పత్తికొండ: సోలార్ కంపెనీలు గ్రామపంచాయతీకి 10 శాతం నిధులు ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయి ఏ గ్రామం అభివృద్ధి అయింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఈనెల 14వ తారీఖున అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నందు పెద్ద శాదిఖాన ఫంక్షన్ హాల్ లో సోలార్ బాధిత రైతులు తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామం నందు సోలార్ బాధితుల రైతు సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సురేంద్ర అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోలార్ కంపెనీలు ద్వారా గ్రామపంచాయతీ అభివృద్ధికి 10 శాతం నిధులు జమ కావలసి ఉండగా అవి ఏ ఖాతాకు జమ అవుతుందో చెప్పాలని స్థానిక అధికార పార్టీ నాయకులు చెప్పాలని కోరారు. సోలార్ కంపెనీలకు భూములు ఇచ్చిన బాధిత రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికార పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోలార్ బాధిత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు ఉదృతం చేయడంలో భాగంగా ఈనెల 14వ తారీఖున గుత్తిలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం పత్తికొండ మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర రైతు సంఘం అధ్యక్షులు గంగన్న ఉపాధ్యక్షులు మధు రాజుల కారప్ప కౌలుట్ల బ్రహ్మయ్య జయప్రకాశ్ రెడ్డి ఉమాకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


