NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మనసున్న మహారాజు మా అన్న.. పేదల పెన్నిధి మా అన్న

1 min read

ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్న ఈడిగ గోవింద్ గౌడ్

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఈడిగ గోవింద్ గౌడ్ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తన వంతు సహాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు.“మనసున్న మహారాజు మా అన్న.. పేదల పెన్నిధి మా అన్న” అంటూ ఈడిగ గోవింద్ గౌడ్‌ను అభిమానులు, కార్యకర్తలు కొనియాడుతున్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, అవసరమైన సమయంలో ఆర్థికంగా, సామాజికంగా సహాయం చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు.

పేదలకు అండగా.. ఆపదలో ఆత్మీయుడిగా

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయం చేయడం, విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం, ఆలయాలు మరియు సామాజిక కార్యక్రమాలకు విరాళాలు అందించడం వంటి పలు సేవా కార్యక్రమాల్లో ఈడిగ గోవింద్ గౌడ్ ముందుంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా తమ సమస్యను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా..

ఆలూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, విద్య, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.

 అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం

సాధారణ కార్యకర్తల నుంచి పేద కుటుంబాల వరకు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కష్టాల్లో ఉన్న వారికి భరోసా కల్పించడం ఈడిగ గోవింద్ గౌడ్ ప్రత్యేకతగా అభిమానులు చెబుతున్నారు. పదవులు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు.“ప్రజలే కుటుంబం.. ప్రజా సేవే లక్ష్యం” అనే భావనతో ముందుకు సాగుతున్న ఈడిగ గోవింద్ గౌడ్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

About Author