NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొణిదేల పాఠశాలలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల జిల్లా పరిషత్ పాఠశాలలో ఏపీ సాక్స్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దిశా లెడ్ ఆద్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి బుధవారం అవగాహన కల్పించారు.సిఎల్ డబ్ల్యూ  బుజ్జమ్మ,జోనల్ సూపర్వైజర్ ఎస్ రామిరెడ్డి, మొబైల్ ఐసిటిసి కౌన్సిలర్ నాగమల్లిక,ఎల్ డి బాలాజీ ‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ హెచ్ఐవి/ ఎయిడ్స్ సుఖ వ్యాధి పట్ల  అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్ఐవి కి గురికాకుండా చూసుకోవచ్చనికేవలం అసురక్షిత లైంగిక సంబంధాలు హెచ్ఐవి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవితో కలుషితమైన సూదులు సిరంజీలు పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందన్నారు ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.అదేవిదంగా హెచ్ఐవి ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఆర్టీ కేంద్రాలు,లింక్ ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఉండవని అన్నారు.వీటి పట్ల అనుమానాలు ఉంటే జాతీయ హెల్ప్ లైన్ 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author