NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమము లో భాగంగా, కర్నూలు లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు మరియు గ్రామీణ  బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు యూనియన్ బ్యాంకు గాయత్రి ఎస్టేట్ దగ్గర సాయంత్రం 5.30 గ లకు పెద్ద సంఖ్యలో నిరసన లో పాల్గొన్నారు.గత పదేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్న డిమాండ్ వారానికి ఐదు రోజుల పని విధానం (5 Days Banking) అమలు చేయాలనేదే. ఈ డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) 2023 డిసెంబర్ 7న బ్యాంకు యూనియన్లతో జరిగిన అవగాహన ఒప్పందంలో అంగీకరించింది. అనంతరం 2024 మార్చి 8న కుదిరిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని అంగీకరించి, కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం IBA ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో యూనియన్లు గతంలో మూడు సార్లు సమ్మె పిలుపునిచ్చి, సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద జరిగిన కన్సిలియేషన్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు “ఖచ్చితంగా ఐదు రోజుల పని విధానం అమలు చేస్తాము” అని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించుకున్నాం. కానీ ఇప్పుడు “ఖాతాదారులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది” అని చెప్పడం విచారకరం బ్యాంకు ఉద్యోగులు ఆరోగ్యంగా 60 ఏళ్ల వయస్సులో ఉద్యోగ విరమణ చేయాలంటే తప్పనిసరిగా ఐదు రోజుల బ్యాంకింగ్ పని విధానం అమలు చేయాల్సిందేనని నాయకులు డిమాండ్ చేశారు. 5 రోజుల పనిదినాలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించి, కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపినప్పటికీ ఆలస్యం చేయడం వల్లే ఈ సంవత్సరము జనవరి 27న  సమ్మెచేయడం జరిగింది.ప్రజలు గమనించవలసిందేమిటంటే — ఈ పోరాటాలు జీతభత్యాల కోసం కాదు, పని భారం తగ్గించుకోవడం మరియు ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రమే. ఈ న్యాయమైన పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము.ఈ నిరసన UFBU కన్వీనర్ ఇ. నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో AIBEA జిల్లా నాయకులు శివ కృష్ణ,అజయ్ వాసుదేవ రెడ్డి, అన్వార్,AIBOC నాయకులు రాజు (UBI ) చంద్ర మోహన్ (SBI),  పుష్పక్ కుమార్ (Canara Bank),NCBE నాయకులు విద్యా సాగర్ (DGS, SBI),శ్రీకాంత్ APGB నాయకులు హనుమంత రెడ్డి, రాఘవేంద్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author