NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి కోకో జట్టుకు తుగ్గలి క్రీడాకారులు ఎంపిక

1 min read

న్యూస్ నేడు , పత్తికొండ:  అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి కోకో పోటీలకు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం తుగ్గలి గ్రామానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. కర్నూలు  అవుట్ డోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి యూ. 23,17 బాలుర ఖో ఖో సెలక్షన్స్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో  తుగ్గిలి క్రీడాకారులు ఖో ఖో క్రీడల్లో జిల్లా స్థాయి టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి, రాష్ట్రస్థాయి అమరావతిలో జరిగే అమరావతి ఛాంపియన్షిప్స్ టోర్నమెంటుకు బి.అనిల్, మహేష్, శివ,కార్తీక్,సాయి, హరికృష్ణ, అభి, నవీన్ కోకో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల పత్తికొండ నియోజకవర్గం సర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్చార్జి వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు చందు నాయక్, స్థానిక క్రీడాభిమానులు హర్ష వ్యక్తం చేస్తూ, క్రీడాకారులను అభినందించారు.

About Author