NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ వసూళ్ల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

1 min read

పనులు కేటాయించే ముందు కాంట్రాక్టర్ల జీఎస్టీ నమోదు తప్పనిసరిగా పరిశీలించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : జీఎస్టీ వసూళ్ల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.బుధవారం కలెక్టరేట్ లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో  జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశాన్ని  కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచడంతో పాటు పన్ను వసూళ్లలో పారదర్శకతను పెంచాలన్నారు. జీఎస్టీ బకాయిలు, రెవెన్యూ బకాయిల వసూళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘కొనుగోలు’ పోర్టల్‌లో వేలం ప్రక్రియకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు.. జిల్లాలో పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు, వాణిజ్య కార్యకలాపాల వివరాలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. ఇంజనీరింగ్  శాఖల పరిధిలో వివిధ పనులను కేటాయించే ముందు సంబంధిత సంస్థలు లేదా కాంట్రాక్టర్లకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా నిర్ధారించాలన్నారు. ప్రభుత్వ పనులను కేటాయించే సమయంలో సంబంధిత సంస్థల జీఎస్టీ వివరాలను ముందుగానే పరిశీలించి, నిబంధనల ప్రకారం మాత్రమే పనులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు..బకాయిలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి 24 గంటల్లో అవసరమైన ఫ్రీజింగ్ చర్యలు చేపట్టేలా సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు సమాచారాన్ని వేగంగా పరస్పరం పంచుకుని, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. పన్ను డిఫాల్టర్ల PAN నంబర్ల ఆధారంగా బ్యాంకు ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయాలని, అదే విధంగా ఫ్రీజ్ చేసిన అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఖాతాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ ను ఆదేశించారు. సమావేశంలో కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, ఏపీఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కామేశ్వర ప్రసాద్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి బజారి, జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి , మైనింగ్ శాఖ డిడి నాగిని,  కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author