NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి చదరంగం పోటీలలో రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి చదరంగం పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, కర్నూలు జిల్లాకు విశేష కీర్తి తీసుకొచ్చారు. ఆగస్టు 8, 9 తేదీలలో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-12 స్కూల్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్-2026 పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా 80 పాఠశాలలు పాల్గొన్నాయి . ఈ పోటీలలో రిడ్జ్ పాఠశాల జట్టు రన్నరప్‌గా నిలిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. రిడ్జ్ పాఠశాలకు చెందిన బీ. షణ్ముఖ్, కే. గణేష్ కార్తికేయ, కే. మన్విత్ నాయక్, కే. రిశ్విత భాయ్, ఎం. జోషిత్ రెడ్డి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జట్టు ప్రదర్శనతో రిడ్జ్ పాఠశాల జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.ముఖ్యంగా కే. మన్విత్ నాయక్ బోర్డ్ నంబర్-1పై 7కు 7 విజయాలు సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవడం విశేషం.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో సీఈఓ జి. గోపీనాథ్  మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ విజయం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, పట్టుదలతో నిరంతరం సాధన చేయడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ విజయం రిడ్జ్ పాఠశాలకే కాకుండా కర్నూలు జిల్లాకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు.కో-సీఈఓ సౌమ్య గోపీనాథ్  మాట్లాడుతూ, చదరంగం వంటి క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.విద్యార్థులను ఈ స్థాయికి తీర్చిదిద్దిన చదరంగం కోచ్ ఎన్. ఇమామ్ హుస్సేన్ ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఏ. రాజ్‌కమల్  , హెచ్‌ఓడీలు ఏ. నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజేత విద్యార్థులను అభినందించారు.

About Author